
ఉరి వేసుకుని భార్య హంతకుడు ఆత్మహత్య
బొల్లాపల్లి:అనుమానం పెనుభూతమై అర్ధాంగిని కడతేర్చిన భర్త అదే గ్రామ పొలాల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం జరిగింది. భార్యాభర్తల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. బండ్లమోటు ఎస్‌ఐ ఏ. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లవాగు గ్రామ పొలాల్లో గంగనబోయిన వెంకటేశ్వర్లు (37) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల కిందట ఇదే పొలాల్లో భార్య కృష్ణకుమారిని హత్య చేసి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేసిన ప్రదేశానికి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. పొలానికి వచ్చిన గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రాంతానికి వారు చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు తమ్ముడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ఉరి వేసుకుని భార్య హంతకుడు ఆత్మహత్య