
గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సామాజిక సేవా విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు గవర్నర్ పురస్కారాలు లభించాయి. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రెడ్‌క్రాస్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రెడ్‌క్రాస్ గుంటూరు జిల్లా చైర్మన్ డాక్టర్ వడ్లమాని రవి, వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు అవార్డులను అందుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి, 2023–24 ఆర్థిక సంవత్సరానికి తృతీయ ఉత్తమ జిల్లాగా గుంటూరు రెడ్‌క్రాస్‌కు అవార్డులు వరించాయి.
కుడి జల విద్యుత్ కేంద్రం ఉద్యోగుల నిరసన
విజయపురిసౌత్: ఎన్‌సీసీవోఈఈఈ దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు జేఏసీ నాయకులు, ఉద్యోగులు సంఘీభావంగా కుడి జలవిద్యుత్ కేంద్రం ప్రధాన ద్వారం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో 15 నిమిషాల సేపు ఆందోళన చేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జి. రాజారెడ్డి, సెక్రటరీ అములు నాయక్, కన్వీనర్ బి. సూరజ్‌చంద్, కో–చైర్మన్ వెంకటేశ్వర్లు, కో–సెక్రటరీ రాణి, కో–కన్వీనర్ రామకృష్ణ, ఎన్. సాంబశివరావు, మెంబర్స్ ఎస్‌కే అక్బర్, రేవతి, సీహెచ్. తిరుపతిరావు, వై. వెంకటేశ్వర్లు, మనోహరమ్మ, సీహెచ్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి నోటీసులు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ఈ నెల 11వ తేదీన సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరుకావాలంటూ.. సత్తెననపల్లి పట్టణ పోలీసులు బుధవారం ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి అక్రమ కేసులు నమోదు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. క్రైం నెంబర్ 156/2025 అండర్ సెక్షన్ 189(2), 189(3), 189(4), 298, 351 (2), 352, 126(2), 61(2) రెడ్‌విత్ 190 బీఎన్‌ఎస్ అండ్ సెక్షన్ 3ఆఫ్ పీడీపీపీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు అంశంలో జరిగిన నేరానికి సంబంధించి మీ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా రూఢీ అయిన నేపధ్యంలో, దర్యాప్తులో భాగంగా సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్‌కు హాజరుకావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.
వైకుంఠపుర వాసుని ఆదాయం రూ.46.76 లక్షలు
తెనాలి రూరల్: స్థానిక వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ టి.సుభద్ర, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.అనుపమ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హుండీల లెక్కింపు జరిగింది. 113 రోజుల అనంతరం లెక్కింపు జరిపారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు స్వచ్ఛందంగా లెక్కింపు సేవలో పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు

గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు

గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు