
వైభవంగా సుభద్రమ్మశోభాయాత్ర
తాడేపల్లిరూరల్: తాడేపల్లిలో ఆదివారం అత్యంత వైభవంగా సుభద్ర అమ్మవారి శోభాయాత్ర జరిగింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా సుభద్ర అమ్మవారికి ఇస్కాన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సీతానగరం శ్రీమద్విరాంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి వివిధ రకాల పూలు, సారెలతో ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ సీతమ్మవారి పాదాల వరకు యాత్ర కొనసాగింది. దారిపొడవునా యువతులు, చిన్నారులు కోలాటాలు, నృత్యాలతో అలరించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.