
నష్టపరిహారం సెంటుకు రూ.లక్ష ఇప్పించండి
చిలకలూరిపేట రూరల్ పరిధిలోని గంగన్నపాలెం, కోమటినేనివారిపాలెం తదితర గ్రామాల రైతులకు చెందిన సుమారు 7.15 ఎకరాల భూమి నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారికి తీసుకున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10లక్షల మాత్రమే నష్టపరిహారం ఇస్తామంది. మార్కెట్ విలువ ఎకరా రూ.97లక్షలుగా ఉంది. కనీసం సెంటుకు రూ.లక్ష మేర నష్టపరిహారం చెల్లిస్తేనే మాకు నష్టం లేకుండా ఉంటుంది. ప్రైవేటు రేటు ప్రకారం తమ భూములు రూ.2 కోట్లు పలుకుతున్నాయి.
–నకరికల్లు–వాడరేవు
జాతీయ రహదారి బాధితులు