
వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోపిరెడ్డి
సాక్షిప్రతినిధి,గుంటూరు: వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులుగా మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ వస్తోంది. ఒక కేసులో బెయిల్ తెచ్చుకుంటే మరో కేసు బనాయిస్తూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ గ్రూపు తగాదాలలో జరిగిన హత్యలను కూడా పిన్నెల్లి సోదరులపై పెట్టి కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సమన్వయం చేసుకుంటూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముందుకువెళ్లనున్నారు.