నిజాంపట్నం: మండల కేంద్రమైన నిజాం పట్నంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 144 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 64 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిక్రూట్‌మెంట్ మేళాలో ఎంఎస్ మహేంద్ర ఆటో పయనీర్ వరల్డ్, ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్, నిర్మల ఇండస్ట్రీస్, పవర్ సర్వీసెస్, బెంగళూరు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్‌లతో పాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక చేశారన్నారు. ఎంపికై న వారికి అప్రంటీస్ శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని తెలిపారు. శిక్షణ కాలంలో భృతి అందించనున్నట్లు వివరించారు.
మార్టూరులో గడ్డివామి దగ్ధం
మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వామి దగ్ధమైంది. స్థానిక తూర్పు బజారుకు చెందిన పుట్టా విలాస్ బాబు గొడ్ల చావిడిలో ఉన్న వరి గడ్డి వామిపై బాణసంచా పడటంతో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో చిలకలూరిపేట నుంచి వచ్చిన అగ్నిమాపక కేంద్ర సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 వేల ఆస్తినష్టం జరిగినట్లు రైతు వాపోయారు.
మోసానికి ప్రతిరూపం చంద్రబాబు
అద్దంకి: ‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకొచ్చే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరవాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు అంటే మోసం అనేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా తన తండ్రి తరువాత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పకుండా హామీలన్నీ నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం అని ప్రజలు అనుకునేలా చేశారని తెలిపారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవి వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం