సైనిక స్కూల్‌గా శ్రీరామా రూరల్‌ హైస్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

సైనిక స్కూల్‌గా శ్రీరామా రూరల్‌ హైస్కూల్‌

May 9 2025 1:20 AM | Updated on May 9 2025 1:20 AM

సైనిక స్కూల్‌గా శ్రీరామా రూరల్‌ హైస్కూల్‌

సైనిక స్కూల్‌గా శ్రీరామా రూరల్‌ హైస్కూల్‌

తెనాలి: తెనాలి సమీపంలోని కొల్లూరు మండలం చిలుమూరులో గల శ్రీరామా రూరల్‌ హైస్కూలు ఇప్పుడు సైనిక్‌ స్కూలుగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ నుంచి అనుమతులు లభించాయి. హైస్కూలు ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీరామా రూరల్‌ అకాడమీ అధ్యక్షుడు కొలసాని తులసీ విష్ణుప్రసాద్‌ వివరాలను వెల్లడించారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచి సైనిక్‌ స్కూల్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. భారతదేశంలో మొత్తం 33 సైనిక్‌ స్కూల్స్‌ పనిచేస్తుండగా, మన రాష్ట్రంలో కోరుకొండ, కలిగిరిలో నడుస్తున్నాయని గుర్తుచేశారు. వీటితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో తొలి దశలో 42 సైనిక్‌ స్కూల్స్‌కు, ఇప్పుడు మరో 33 సైనిక్‌ స్కూల్స్‌కు భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ అనుమతినివ్వగా, అందులో గుంటూరు జిల్లా నుంచి 76 ఏళ్లుగా నడుస్తున్న శ్రీరామా రూరల్‌ హైస్కూలు ఒకటి కావటం గర్వకారణమన్నారు. కృష్ణానది ఒడ్డున దారీతెన్నూ లేని గ్రామీణ ప్రాంతంలో అప్పట్లో గురుకులంగా ఏర్పాటైన తమ పాఠశాల ఏటికేడాది ప్రగతి బాటన పయనిస్తూ ఈ స్థాయికి చేరిందన్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ 1987లో కంప్యూటర్‌ లాబ్‌, 2020 నుంచి సీబీఎస్‌ఈ, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌తో రోబోట్రిక్స్‌, డ్రోన్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, స్కాచ్‌ కోడింగ్‌లో విద్యార్థులకు శిక్షణనిస్తున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది నుంచి కృత్రిమ మేధలోనూ తరగతులు ఉంటాయన్నారు. మరోవైపు విద్యార్థులు పరిపూర్ణ వికాసానికి ఎన్‌సీసీ, క్రీడలకు తగిన ప్రాధాన్యతనిస్తూ జాతీయస్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. శ్రీరామా రూరల్‌ హైస్కూల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఉత్తమ విద్యతోపాటు దేశానికి అవసరమైన భావిభారత పౌరులను తీర్చిదిద్దే దిశగా తమ సైనిక్‌స్కూల్‌ పనిచేస్తుందని చెప్పారు.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ అనుమతి వెల్లడించిన శ్రీరామా అకాడమీ అధ్యక్షుడు తులసీ విష్ణుప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement