
తొండపిలో పోలీసుల కార్డన్ సెర్చ్
తొండపి(ముప్పాళ్ళ): మండలంలోని తొండపి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ, ఫ్యాక్షన్ నేపధ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలలో భాగంగా గృహాలను తనిఖీ చేయటం జరిగిందన్నారు. ప్రతి ఇంటిని, దుకాణాలను సోదాలు చేశారు. పలు ఇళ్లలో మారణాయుధాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లుగా తమ దృిష్టి వచ్చిందని, అసాంఘిక నేరాలకు పాల్పడే వారిపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 60 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎటువంటి పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్, స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సుబ్బారావు, ముప్పాళ్ల ఎస్‌ఐ వి.సోమేశ్వరరావు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.