
ఘనంగా నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల
పట్టువస్త్రాలు సమర్పించిన
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
దాచేపల్లి: మండలంలోని ముత్యాలంపాడులో శ్రీ నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఆదివారం కనులపండువలా జరిగింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా కుంకుమబండ్లు కట్టి గ్రామంలో ఊరేగించారు.
మాజీ ఎమ్మెల్యే కాసు ప్రత్యేక పూజలు..
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి నీలంపాటి అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. కాసు వెంట జెడ్పీటీసీ మూలగొండ్ల కృష్ణకుమారి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గొట్టిముక్కల పెదహనిమిరెడ్డి, ఎంపీపీ కందుల జాను, సర్పంచ్ నెమలికొండ వెంకటచారి, ఎంపీటీసీ పొస వెంకటనాగయ్య, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కోట కృష్ణతో పాటుగా గ్రామ నాయకులు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లోనే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
నరసరావుపేట: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు వరసగా చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కారణంగా వేదికలో మార్పు జరిగిందన్నారు. ఐదో తేదీ సోమవారం మాత్రం యథావిధిగా కలెక్టరేట్ వేదికగా పీజీఆర్‌ఎస్ జరుగుతుందన్నారు.