
కౌలు రైతుల సమస్యలు పరిష్కరించండి
లక్ష్మీపురం: రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి జగన్నాథం అన్నారు. గుంటూరు కొత్తపేటలోని కౌలురైతు సంఘం కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందడంలేదని మండిపడ్డారు. గుర్తింపు కార్డులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మే 6వ తేదీన గుంటూరు మల్లయ్య లింగం భవన్‌లో ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో కౌలు రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి పాల్గొన్నారు.
కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం