ఈపూరు(శావల్యాపురం): సీ్త్రనిధి మొండి బకాయిల వసూలు వేగవంతం చేయాలని జిల్లా సీ్త్రనిధి ఏజీఎం రంతు చిన బుల్లెయ్య అన్నారు. మంగళవారం ఈపూరు మండలం వెలుగు కార్యాలయంలో సీ్త్రనిధి రుణాల రికవరీ పురోగతిపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సీ్త్రనిధి మొండి బకాయిలు రూ.15 కోట్లు ఉండగా ఇప్పుటి వరకు రూ.5కోట్లు వసూలు చేశామన్నారు. ఈనెలాఖారులోగా పెండింగ్‌లో ఉన్న రుణాలను రీకవరీ చేయాలన్నారు. రుణాలు సకాలంలో చెల్లిస్తే మహిళల జీవనోపాధుల పెంపుదలకు దోహదపడతాయన్నారు. బొల్లాపల్లి మండలం రూ.53 లక్షలు, ఈపూరు రూ.53లక్షలు, అమరావతి రూ.82లక్షలు, యడ్లపాడు రూ.79లక్షలు, గురజాల రూ.79 లక్షలు, నరసరావుపేట రూ.71లక్షలు, అచ్చంపేట రూ.69 లక్షలు, పిడుగురాళ్ళ రూ.47 లక్షలు, క్రోసూరు రూ.37 లక్షలు, దాచేపల్లి రూ.44లక్షలు, కారంపూడి మండలంలో రూ. 35 లక్షల మొండి బకాయిలు ఉన్నాయని మండలాల వారిగా ఉన్నతాధికారులు రీకవరీ టీం సభ్యులను ఏర్పాటు చేసి నూరుశాతం వసూలు చేయటానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 24 వేల మంది మహిళా సభ్యులకు సీ్త్రనిధి రుణాలు రూ.120 కోట్లు ఇవ్వటానికి లక్ష్యంగా ఏంచుకొనగా ఇప్పుటి వరకు 5400 మంది మహిళలకు రూ.41 కోట్లు రుణాలను అందజేశామన్నారు. సీ్త్రనిధి రుణాలు చెల్లింపులు సక్రమంగా లేకపోవటం వలన లక్ష్యాలను అధిగమించలేదన్నారు. అనంతరం ఈపూరు మండలం వనికుంట, బొమ్మరాజుపల్లి గ్రామాల్లో పర్యటించి గ్రామసంఘం సభ్యులతో మాట్లాడి సీ్త్రనిధి రుణాలు వసూలు పురోగతిపై సమీక్షంచారు. ఆయనతో పాటు సీసీలు అబ్బురి రామారావు, నరేష్, సీలార్‌బీ వీవోఏలు ఉన్నారు.
సీ్త్రనిధి జిల్లా ఏజీఎం చిన బుల్లెయ్య