● ఈ నెల 3న ఫిరంగిపురంలో కేసు నమోదు ● రాజమండ్రి జైలు నుంచి నరసరావుపేట కోర్టుకు హాజరు ● వచ్చే నెల 4వ తేదీవరకు రిమాండ్
నరసరావుపేటటౌన్: బోరుగడ్డ అనిల్‌ను ఫిరంగిపురం పోలీసులు పీటీ వారెంట్‌పై నరసరావుపేట కోర్టులో సోమవారం హాజరు పరిచారు. అనిల్‌పై ఫిరంగిపురం పోలీసులు ఈ నెల 3వ తేదీన కేసు నమోదు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అతన్ని పీటీ వారెంట్‌పై పట్టణానికి తెచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను సామాజిక మాధ్యమాల్లో దూషించాడని ఫిరంగిపురంకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ అన్నమ్మ భర్త పెరికల లూర్దయ్య ఈ నెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు 351(1),351(2), 351(4),352, 356(2),79 బీఎన్‌ఎస్, 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.