పట్టణాన్ని గ్రామం చేయడమేమిటి?
అభిప్రాయ సేకరణ రసాభాస
పిడుగురాళ్ల: పట్టణాన్ని గ్రామం చేయడమేమిటని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పల్లెటూరు గ్రామం కావాలి, గ్రామం పట్టణం కావాలని, పట్టణం నగరం కావాలని అకాక్షిస్తుంటాం, దానికి అనుగుణంగా రాజకీయ నాయకులు పనిచేస్తారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి గురజాల, దాచేపల్లిలకు పట్టణ హోదా కల్పించామని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఇళ్ల పట్టాలు కేటాయించామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇళ్లు నిర్మించుకునేందుకు సుమారు రూ.2 నుంచి రూ.2.50 లక్షలు కేటాయించామన్నారు. మాచర్ల, గురజాల, దాచేపల్లి పట్టణాలకు కలుపుతూ సుమారు రూ.400 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేశామన్నారు. అమృత్ పథకం కింద శుద్ధి చేసిన తాగునీటిని ప్రతి ఇంటికి అందించాలని గురజాల పట్టణానికి సుమారు రూ.17 కోట్లు, దాచేపల్లి పట్టణానికి సుమారు రూ.25 కోట్లు మంజూరు చేశామన్నారు. గురజాలలో పనులు ప్రారంభించామని, కానీ ఒకటిన్నర సంవత్సరం నుంచి పనులను పట్టించుకున్న నాథుడు లేడన్నారు. అవగాహన, తేలివి లేని నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే ఏవిధంగా ఉంటుందో ఈ రోజు చూస్తున్నామన్నారు. జంగమహేశ్వరపురాన్ని మరలా గ్రామం చేస్తారంటా, అది ఏమైనా గొప్ప అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి గ్రామం చేస్తే ఇంటి పన్నులు తగ్గుతాయని చెబుతున్నారన్నారు. ఇంటి పన్ను తగ్గించటం కోసం పట్టణాన్ని గ్రామం చేయనక్కరలేదన్నారు. ఇంటి పన్ను ఇంత ఉంది ఇంత తగ్గిస్తున్నామని జీవో తీసుకొని వస్తే సరిపోతుంది కదా అని అన్నారు. గురజాల మున్సిపాలిటీ గెలవలేమని, జంగమహేశ్వరపురాన్ని తీసేస్తున్నారన్నారు. ఇంటి పన్ను కట్టలేకపోతే ఐదేళ్లు, పదేళ్లు మినహాయింపు ఇవ్వవొచ్చుకదా అని కాసు పేర్కొన్నారు. పట్టణాన్ని గ్రామం చేస్తామంటున్నారు, దీనిని వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జంగమహేశ్వరపురం, గురజాలలో ఇంటి పన్ను తగ్గించటం కానీ, ఉపాధి హామీ పథకం కొనసాగించండి, మున్సిపాలిటిని గ్రామం చేయటం అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
సభ మధ్యలో వెళ్లిపోయిన
అధికారులు


