మెప్మాలో రూ.20 కోట్ల కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

మెప్మాలో రూ.20 కోట్ల కుంభకోణం

Dec 20 2025 7:14 AM | Updated on Dec 20 2025 7:14 AM

మెప్మాలో రూ.20 కోట్ల కుంభకోణం

మెప్మాలో రూ.20 కోట్ల కుంభకోణం

మెప్మాలో రూ.20 కోట్ల కుంభకోణం

డీఆర్‌ఓకు ఫిర్యాదు చేసిన

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

ఎమ్మెల్యే అరవింద్‌ బాబు, వాసిరెడ్డి

రవి కనుసన్నల్లోనే కుంభకోణం

సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులపై

చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో నరసరావుపేటలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, మెప్మా అధికారుల ప్రోద్బలంతో దాదాపు 140 ఫేక్‌ డ్వాక్రా గ్రూపులు సృష్టించి సుమారు రూ.20 కోట్ల మేర భారీ కుంభకోణం చేశారని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ ఏకా మురళిని కలిసి వివరాలు అందజేశారు. అనంతరం డాక్టర్‌ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నరసరావుపేట పురపాలక సంఘంలోని మెప్మా విభాగానికి వచ్చిన డ్వాక్రా సిటీ మెషిన్‌ మేనేజర్‌ (సీఎంఎం) దీప గతంలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నల్లపాడులో పనిచేస్తూ భారీ కుంభకోణానికి పాల్పడడంతో సస్పెడ్‌ చేశారని తెలిపారు. ఆమైపె ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, ఈ కేసుపై గుంటూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో వాయిదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇంత ఖ్యాతి గల ఈమెను ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, మున్సిపాల్టీ వ్యవహారాలు చూసే టీడీపీ నాయకుడు వాసిరెడ్డి రవిలు కలిసి నరసరావుపేట తీసుకువచ్చారని తెలిపారు. డ్వాక్రా సిటీ మెషిన్‌ మేనేజర్‌ (సీఎంఎం) దీప, డ్వాక్రా గ్రూపుల సీసీ ప్రణతి ఇరువురు కలిసి టీడీపీ నాయకుల ప్రమేయంతో డ్వాక్రా గ్రూపు లీడర్లు, ఆర్‌పీలతో కుమ్మకై ్క సుమారు 140 ఫేక్‌ డ్వాక్రా గ్రూపులు తయారుచేశారన్నారు. ఈ ఫేక్‌ గ్రూపులకు బ్యాంకుల వద్ద నుంచి ఒక్కొక్క గ్రూప్‌కు రూ.15 నుంచి రూ.20 లక్షల రుణాలు ఇప్పించారన్నారు. ఇందుకు సంబంధించి ఒక్కొక్క డ్వాక్రా గ్రూపు వద్ద నుంచి రూ.5 లక్షలు వసూలు చేసి అందులో 50 శాతం ఎమ్మెల్యేకి అందజేశారని విమర్శించారు. మిగతా 50 శాతం అందరూ పంచుకున్నారని చెప్పారు. నవంబర్‌ 20న కలెక్టర్‌కు ఒక డ్వాక్రా గ్రూప్‌ సభ్యురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారం చేసుకుని ప్రాథమికంగా విచారణ చేయటంతో ఈ స్కాం బయటపడిందని తెలిపారు. కుంభకోణం వివరాలు కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్‌ ముఖ్యమంత్రికి తెలియజేయగా ఆయన కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి డబ్బు ఎవరెవరికి, ఎంతెంత చేరిందనే దానికి సంబంధించి ఆడియోలు, వీడియోలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. వీటన్నిటిని అతి త్వరలో కలెక్టర్‌కి అందజేస్తామన్నారు. కలెక్టర్‌ ఈ కుంభకోణంపై పూర్తి విచారణచేసి పాత్రధారులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో ప్రమేయం ఉన్న అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గంటెనపాటి గాబ్రియేలు, పాలపర్తి వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు షేక్‌ కరిముల్లా, వర్కింగ్‌ అధ్యక్షులు అచ్చిశివకోటి, బీసీసెల్‌ పట్టణ అధ్యక్షులు మర్రిపూడి రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement