
సత్తెనపల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చామని, జరిగిన అభివృద్ధిని, సంక్షేమ లబ్ధిని ప్రజలకు వివరించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు సూచించారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు, నవరత్న పథకాలతో ప్రజల ముంగిటకే పాలన వచ్చిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఈనెల 22న వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర, బహిరంగ సభ జరుగుతుందని, అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. ఆదివారం అంబటి ముఖ్య నాయకులతో కలిసి పట్టణంలోని తాలూకా సెంటర్‌లోని బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. సామాజిక బస్సుయాత్ర విజయవంతంపై పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. బీసీ డిక్లరేషన్‌తో సరికొత్త చరిత్రకు నాంది పలికినట్లు పేర్కొన్నారు. జరిగిన మేలు ప్రజలకు చెప్పేందుకు బస్సుయాత్ర ఉపయోగ పడుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని యాత్రను జయప్రదం చేయాలని కోరారు. అంబటితోపాటు వైఎస్సాసీపీ నియోజక వర్గ నాయకుడు పక్కాల సూరిబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి, రాయపాటి పురుషోత్తమరావు, వ్యవసాయ సలహా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కళ్ళం విజయ భాస్కర్‌రెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్, రెడ్డిగూడెం కరీముల్లా, నాయకులు తదితరులు ఉన్నారు.
16న నియోజకవర్గ స్థాయిలో సన్నాహక సమావేశం
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఈనెల 16న ఉదయం 9 గంటలకు నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం జరగనుంది. సమావేశానికి నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు హాజరు కావాలని మంత్రి అంబటి కార్యాలయవర్గాలు కోరాయి. బస్సు యాత్రపై చర్చించనున్నట్టు వెల్లడించాయి.
జరిగిన మేలును వివరించడమే ఉద్దేశం ఈనెల 22న సత్తెనపల్లిలో వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర, బహిరంగ సభ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు