శ్రీకాకుళం పాతబస్టాండ్: నియోజకవర్గంలో ఓటర్ల మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, శ్రీకాకుళం అర్బన్‌లో మ్యాపింగ్ శాతం తక్కువగా ఉన్నందున ప్రక్రియ వేగవంతం చేయాలని ఆర్డీవో సాయిప్రత్యూష ఆదేశించారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో శనివారం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్)–2026లో భాగంగా 2022 ఓటర్ల జాబితాతో 2026 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేయాలన్నారు. ఇప్పటివరకు గార 77.74 శాతం, శ్రీకాకుళం రూరల్ 79.86 శాతం, శ్రీకాకుళం అర్బన్‌లో 47 శాతం పూర్తయ్యిందన్నారు. పారదర్శక జాబితా తయారీకి సలహాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం తహసీల్దార్ ఎస్.గణపతిరావు, గార తహసీల్దార్ చక్రవర్తి, అర్బన్ ఎఈఆర్‌వో జానకి, ఎన్నికల డీటీ జి.కె.శ్రీనివాసరావు, నాయకులు రౌతు శంకరరావు, ఈశ్వరి, ఎం.వెంకటేష్, శ్రీనివాసరావు, రాధాకృష్ణ రెడ్డి, భాస్కరరావు పాల్గొన్నారు.


