అలరించిన అన్నమయ్య స్వరార్చన | - | Sakshi
Sakshi News home page

అలరించిన అన్నమయ్య స్వరార్చన

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

శ్రీకాకుళం కల్చరల్‌: సమాజాభివృద్ధికి కళ ఎంతగానో దోహదపడుతుందని, అటువంటి కళలను నిరంతం ప్రోత్సహిస్తున్న సమాఖ్య ప్రతినిధులు అభినందనీయులను వక్తలు కొనియాడారు. నగరంలోని బాపూజీ కళామందిర్‌లో శ్రీకాకుళం రంగస్థలం కళాకారుల సమాఖ్య నెలవారీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో 319వ నెల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముందుగా జిల్లా ఉద్యానవన శాఖాధికారి రత్నాల వరప్రసాద్‌, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బుడుమూరు నారాయణమూర్తి, పోలీస్‌శాఖ అధికారి జి.వెంకటేశ్వరరావు, సీఆర్‌పీఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ బెందాళం వరలక్ష్మి చేతుల మీదుగా పేద కళాకారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నమయ్య జయంతి సందర్భంగా శ్రీ షిరిడీ సాయి సంగీత విద్యాలయం నిర్వహణలో మల్లెమొగ్గల లక్ష్మి, శిష్య బందం నిర్వహించిన ‘అన్నమయ్య స్వరార్చన‘ అలరించింది. కార్యక్రమంలో సమాఖ్య కార్యదర్శి బి.రామచంద్రదేవ్‌, సభ్యులు కంచరాన అప్పారావు, బి.ఎ.మోహనరావు, బి.ఎ.ఎం.ఎస్‌.పట్నాయక్‌, పైడి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement