పాలకొండ రూరల్: పాలకొండ శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు గ్రాఫ్ పైయింటింగ్‌పై డ్రా యింగ్ ఉపాధ్యాయుడు జి.మురళీ తర్ఫీదు అందించారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా శనివారం లైసిడా అనే పద్ధతిలో హ్యాండ్ రైటింగ్‌పై పట్టు సాధించటంపై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకుడు బబ్బూరి గణేష్‌బాబు మాట్లాడుతూ.. పఠనంతో అనంత విజ్ఞానం పొందవచ్చన్నారు. సున్నాలు గీయటం వలన చేతి కదలికలు స్పష్టంగా మారి చక్కటి చేతి రాతను సొంతం చేసు కోవచ్చని ఉపాధ్యాయులు నూకాల నగేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయు లు వెంకటరమణ, రాకోటి మల్లేష్, ఈశ్వర్ తదితరులు చరిత్ర సంబంధిత కథలను పిల్లలకు వినిపించారు.


