రణస్థలం: లావేరు మండలం బెజ్జిపురంలో యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం 45వ వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరై స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొలుత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావులు జెండా ఆవిష్కరణ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తూ దేశీయ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, యూత్ క్లబ్ బెజ్జిపురం అధ్యక్షుడు మేడూరి ప్రసాదరావు, సభ్యులు ఇజ్జాడ శ్రీనివాసరావు, పి.మధుబాబు తదితరులు పాల్గొన్నారు.


