● జిల్లా టాపర్‌గా శుభశ్రీ నాయక్
మల్కన్‌గిరి: ఒడిశా బోర్డు పదవ తరగతి పరీక్ష ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మల్కన్‌గిరి జిల్లా టాపర్‌గా 94 శాతం మార్కులు సాధించి బలిమెల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని శుభశ్రీ నాయక్ (94/16 శాతం) జిల్లా టాపర్‌గా నిలిచింది. మల్కన్‌గిరి జిల్లాలో 22 మంది విద్యార్థులు 90 శాతం ఎక్కువ మార్కులు సాధించగా, 66 మంది 80 శాతం కంటే పైగా మార్కులు సాధించారు. దక్షిణ ఒడిశా ఇతర జిల్లాల్లో కూడా అధిక శాతంలో పాస్ అయ్యారు. విజయంపై జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులను సాధించారని అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అభినందించారు.


