రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస గ్రామంలో జాతీ య రహదారిపై రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఐసర్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వృద్ధు డు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తాళ్లవలస గ్రామానికి చెందిన మీసాల రామ్మూర్తి (91) తన పొలంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే గుర్తు తెలియని వాహ నం శనివారం మధ్యాహ్నం 1.30 సమయంలో ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. సంఘటనా స్థలానికి లావేరు ఎస్‌ఐ వెళ్లి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అనంతరం హైవేపై ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి ఐసర్ వ్యాన్‌గా గుర్తించారు. నరసన్నపేట సమీపంలో టోల్‌ప్లాజా వద్ద పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐసర్ వ్యానుగా గుర్తించి పట్టుకున్నారు. మృతుడికి భార్య నారాయణమ్మ, కుమార్తె ఈశ్వర మ్మ ఉన్నారు. ఈ ప్రమాదంపై లావేరు ఎస్‌ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వీర్ పరివార్ సహాయత యోజన–2025’ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.హరిబాబు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని లీగల్ సర్వీస్ అథారిటీ చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సైనిక కుటుంబాలకు ఎదురయ్యే ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, ఇతర న్యాయపరమైన చిక్కులను ఈ పథకం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. జిల్లా, రాష్ట్ర జాతీయ సైనిక సంక్షేమ బోర్డుల సమన్వయంతో ఈ పథకం పనిచేస్తుందని, ఇందులో అనుభవజ్ఞులైన సీనియర్ న్యాయవాదులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉండి తగిన న్యాయ సలహాలు అందిస్తారని ఆయన వివరించారు.
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న దోపిడీ నేర ఘటనల నేపథ్యంలో బంగారం దుకాణాల వర్తకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్ప ష్టం చేశారు. ఆయన శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దుకాణాల వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఉంచుకోవాలన్నా రు. పూండి గోవిందపురానికి చెందిన భారీ కేసుకు సంబంధించి బీహార్‌కు చెందిన గ్యాంగు ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఉన్నారని అక్కడి పోలీసులతో సమన్వయం చేస్తున్నామన్నారు. నరసన్నపేటలో భారీ చోరీ కేసుకు సంబంధించి అక్కడి డీజీతో మాట్లాడామని చెప్పారన్నారు.
బంతి నా కోర్టులోనే ఉంది..
అరసవల్లి వీవీఐపీ పాసులు కేసు ముగియలేదని ఎస్పీ తెలిపారు. బంతి తన కోర్టులోనే ఉందని, సరైన సమయంలో స్పందిస్తామని అన్నారు.
సారవకోట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా త్వరలో యూపీఐ పేమెంట్స్‌కు అవకాశం కల్పించనున్న ట్లు డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ తెలిపారు. శనివారం ఆయ న మండల కేంద్రంలోని డీసీసీ బీ బ్యాంకును ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీసీబీ ద్వారా యూపీఐ పేమెంట్స్ నిర్వహించేందుకు ఆర్‌బీఐ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని రెండు, మూడు రోజుల్లో యూపీఐ పేమెంట్స్‌కు అవకాశం క ల్పించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 28 చోట్ల ఏటీఎం కేంద్రాల ను ఏర్పాటు చేశామని వాటిలో చాలా వరకు యంత్రాలు పాడై పోవడంతో వాటిని తొలగిస్తామని 5 చోట్ల మాత్రమే ఏటీఎం కేంద్రాలను ఉంచనున్నామన్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి అండర్ –11 బాలబాలికల చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపి కై న క్రీడాకారుల జాబితాను చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బగాది కిషోర్, కార్యదర్శి జామి రమేష్, చెస్ ఇన్‌స్కూ ల్స్ రాష్ట్ర కన్వీనర్ సనపల భీమారావు సంయుక్తంగా వెల్లడించా రు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం నగగరంలోని పీఎన్ కాలనీలో ఉన్న న్యూ సెంట్రల్ స్కూల్ వేదికగా నాలుగు రౌండ్ల పాటు జరిగిన జిల్లాస్థాయి అండర్–11 బాలబాలికల చెస్ ఎంపిక పోటీల్లో రాణించి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలు విశాఖపట్నం వేదికగా ఈనెల 9,10 తేదీల్లో జరగనున్నాయి. ఈ పోటీలకు జిల్లా నుంచి బాలురు విభాగంలో అన్నెపు శశాంక్, బోయిన సూర్యజతిన్, బాలికల విభాగంలో ఎం.రిత్విక, మెట్ట తీక్షణ ఎంపికై న వారిలో ఉన్నారు.


