పాలకొండ రూరల్: సీతంపేట మండలం మేడకో ట, పాలకొండ మండలం జంపరకోట మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఆటో ప్రమాద ఘటనలో నలుగురు మృత్యువాత పడటం తీరని ఆవేదన మిగిల్చిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. శనివా రం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు పార్టీ నాయకులతో కలిసి జంపరకోట, డోమల గ్రామాలకు వెళ్లారు. ప్రమాద ఘటనలో మరణించిన ఆరిక లక్ష్మి, కొండగొర్రి శ్రావణి, ఉర్లక శాంతి, ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణ కుటుంబ సభ్యులను కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులు, క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డి.నీలం ఆనందరావు, టి.భుజంగరావు, బి.పైల ప్రభాకర్, జంప రకోటకు చెందిన ఎ.నారాయణ, జి.శ్రీనివాసరావు, రాజాన క్రిష్ణ, వైస్ ఎంపీపీ కనపాక సూర్యప్రకాష్, నాయకులు రణస్థలం రాంబాబు, పి.దవళేశ్వరావు, కె.బాబురావు నాయుడు, పి.వాసునాయుడు, ఎల్.శ్యాంబాబు, పి.శ్రీను, ఎం.శశిభూషణ్, ఆర్.లక్ష్ముంనాయుడు, పి.సురేష్, ఉదయ్‌కుమార్, వై.గౌరినాయుడు, కొత్తకోట అనంతరావు తదితరులున్నారు.


