నేటినుంచి అమ్మవారి సంబరాలు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి అమ్మవారి సంబరాలు

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

అలంకార ప్రియుడు

పర్లాకిమిడి: స్థానిక 9వ వార్డు మార్కెట్‌ క్లాత్‌ మర్చెంట్స్‌ వీధిలో నీలమ్మ అమ్మవారి సంబరాలు ఆదివారం నుంచి ప్రారంభవుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ దేవత నీలమ్మను ఆదివారం వీధిలో కోలువు ఉంచుతారు. సోమవారం నుంచి అమ్మవారికి కుంకుమ పూజలు, హోమాలు నిర్వహిస్తారు. బుధవారం వేకువజామున అమ్మవారి అనుపోత్సవం ఉంటుందని కమిటీ తెలియజేశారు.

వైశాఖ మాసం సందర్భంగా జిల్లా కేంద్రంలోని చిన్నబజారులో ఉన్న దూదివారి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. తులసి, కుసుమాల మాలలతో గోవిందుడు కనువిందు చేశాడు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా.. గోత్రనామాలతో అర్చకులు పూజలు చేశారు. – శ్రీకాకుళం కల్చరల్‌

Advertisement
 
Advertisement
Advertisement