వినూత్నంగా కార్మిక దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

వినూత్నంగా కార్మిక దినోత్సవం

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

జయపురం: సహజంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మికులే ఘనంగా నిర్వహిస్తారు. జయపురం ఏనుగుల శాల ప్రాంతంలో గల సెయింట్‌ జావియర్‌ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో వినూత్నంగా మే డే నిర్వహించారు. కార్మికులు అంటే ఫాక్టరీలలో, భవణ నిర్మానం చేసేవారు, కూలీలు, శ్రామికులే కాదని పాఠశాలలో పిల్లలకు విద్యాభోదన చేసేవారు కూడా కార్మికులేనన్న భావనతో ఆ పాఠశాల యాజమాన్యం భావించింది. దేశ ప్రగతికి, సమాజ ఉన్నతి కోసం శ్రమించిన వారంతా కార్మికులేనన్నారు. మేడే సందర్భంగా ఉపాధ్యాయులను పాఠశాల ప్రధాన మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.శ్రీనివాస పట్నాయక్‌ సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement