మజ్జిగ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

మజ్జిగ పంపిణీ

May 3 2026 8:23 AM | Updated on May 3 2026 8:23 AM

సైబర్‌ క్రైమ్‌ కొత్త సవాలు: డీజీపీ ఖురానియా

పర్లాకిమిడి: వేసవి కాలం సందర్భంగా స్థానిక పురపాలక సంఘం వద్ద గజపతి బ్లడ్‌ డోనర్స్‌ ఆధ్వర్యంలో శనివారం చల్లని మజ్జిగను బాటసారులకు పంపిణీ చేశారు. ఈ మజ్జిగ పంపిణీలో గజపతి బ్లడ్‌ డోనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.నవీన్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు ఎస్‌.రుషి, సభ్యులు కె.శరత్‌ కుమార్‌, మోహినీ, జగత్‌మోహన్‌సాహు, మమతా పాడీ, పాల్గొన్నారు.

భువనేశ్వర్‌: మూడు దశాబ్దాలుగా కొనసాగిన తిరుగుబాటు (మావోయిస్టు) సవాలుకు ముగింపు పలుకుతూ ఒడిశా పూర్తిగా మావోయిస్టు రహితంగా మారిందని రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ) యోగేష్‌ బహదూర్‌ ఖురానియా తెలిపారు. ఒడిశాలో మావోయిస్టుల ఉనికిని నిర్మూలించిన పొరుగు రాష్ట్రాల్లో ఆ ముప్పు కొనసాగుతోంది. దీంతో అంతర్‌రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తతను పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 30 ఏళ్లుగా ఒడిశాలో కొనసాగిన మావోయిస్టుల ఉనికి ఇప్పుడు అంతమైంది. పొరుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు చురుకుగా ఉన్నందున రాష్ట్ర పోలీసు బలగాలు సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నాయన్నారు. పోలీసు కార్యకలాపాల్లో కీలకమైనన మార్పులను చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం సైబర్‌ క్రైమ్‌ కొత్త, పెద్ద సవాలుగా గుర్తించి పోలీసు కార్యాచరణలో భారీ మార్పులు చేపడుతున్నట్లు వివవరించారు. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల మధ్య పోలీసులు నిర్వహించిన భారీ సైబర్‌ ఆపరేషన్‌లో 45,000కు పైగా బ్యాంకు ఖాతాలను పరిశీలించారని ఆయన వెల్లడించారు. 7,000 మందికి పైగా వ్యక్తులకు నోటీసులు జారీ చేసి ఇప్పటి వరకు దాదాపు 350 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు. సైబర్‌ మోసాలను అరికట్టడానికి విస్తృత ప్రజా అవగాహన ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏడాదిలోగా అన్ని ప్రధాన జిల్లా కేంద్రాలలో ప్రత్యేక సైబర్‌ క్రైమ్‌, ఆర్థిక నేరాల విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

రహదారి సౌకర్యం కల్పించండి

జయపురం: తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి పెందపోడ గ్రామ పంచాయతీ పురాణగుడ గ్రామ హహిళలు కోరారు. బొయిపరిగుడ సమితి కార్యాలయానికి శనివారం వచ్చి బీడీఓను కలిశారు. పంచాయతీ కార్యాలయం నుంచి తమ గ్రామానికి పక్కా రోడ్డు వేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుమూల గ్రామాలకు రహదారులు వేసి అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. నేటికీ అనేక గ్రామాలు కనీస రహదారులకు నోచుకోలేదని, అందులో తమ గ్రామం ఒకటి అన్నారు. రహదారి సౌకర్యం లేక పోవటం వలన తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తమ గ్రామానికి పక్కా రోడ్డు వేయాలని అనేక విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. బొయిపరిగుడ సమితి ఉపాధ్యక్షురాలు పూర్ణి య బారిక్‌తో తమ గ్రామ సమస్యలపై చర్చించారు. వారి సమస్యలు తెలుసుకున్న పూర్ణిమ బారిక్‌ వారితో కలిసి బీడీఓ శక్తి మహాపాత్ర వద్దకు వెళ్లారు. పురాణగుడ గ్రామ ప్రజల సమస్యలు, పక్కా రోడ్డు సమస్యను వివరించారు. గ్రామంలో రెండు వీధులు ఉన్నాయని, రెండు వీధులకు రోడ్లు లేవన్నారు. కొద్ది రోజుల కిందట కంధ వీధికి రోడ్డు వేస్తామని అధికారులు వచ్చారని, హరిజన వీధికి ఎందుకు వెయ్యరని బీడీఓను మహిళలు నిలదీశారు. వారి సమస్యలు విన్న బీడీఓ.. త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, గ్రామంలో రెండు వీధులకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement