మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి వెంకటపాలం పంచాయతీలోని పలు గ్రామాల్లో శనివారం కాలవైశాఖి ప్రభావం చూపింది. దీంతో రేకు ఇళ్లు పూర్తిగా ఎగిరిపోయాయి. మాంగిపల్లి గ్రామానికి చెందిన రామే మాడి, కోయాగూఢ గ్రామానికి చెందిన ఇర్మా కబాసి, పానిమెట్ల గ్రామానికి చెందిన లింగే కబాసి, మాలే సోడి, ఇర్మా మాడి, దామా మాడ్కమి, దేవా మాడ్కమి, అలానే ఎంపీవీ 29గ్రామానికి చెందిన దీపా కర్మకార్, రీతా మండల్, మీరా బోస్, సుదాశు వైద్య ఇళ్లు కూలిపోయాయి. ఇళ్లను కలిమెల తహసీల్దార్ రామకృష్ణ సత్యరాజ్ స్వయంగా వెళ్లి పరిస్థితి సమీక్షించారు.


