దుకాణాల్లోకి దూసుకెళ్లిన జేసీబీ | - | Sakshi
Sakshi News home page

దుకాణాల్లోకి దూసుకెళ్లిన జేసీబీ

May 3 2026 8:23 AM | Updated on May 3 2026 8:23 AM

మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం

రాయగడ: బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఓ జేసీబీ దుకాణాల్లోకి దుసుకుపోయింది. దీంతో లక్షలాది రూపాయల సామగ్రి ధ్వంసమయ్యాయి. జిల్లాలోని మునిగుడలోని లక్ష్మణ్‌ నాయక్‌ కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. లక్ష్మణ్‌ నాయక్‌ కూడలి వద్ద బయలు దేరిన జేసీబి హఠాత్తుగా బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లోకి సరాసరి దూసుకువెళ్లింది. దీంతో అక్కడ గల కూరగాయల దుకాణాలతో పాటు ఫ్యాన్సీ, పూజాభాండర్‌ దుకాణాల లోపలకు చొచ్చుకుపోయింది. ఇదే సమయంలో అక్కడే పార్కింగ్‌ చేసి ఉన్న మూడు ద్విచక్ర వాహనాలు కూడా నుజ్జునుజ్జయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోయినప్పటికీ ఆస్తినష్టం జరగడంతొ అందుకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఝార్సుగుడ నుంచి విశాఖపట్నం వెపు వెళుతున్న జేసీబీ ప్రమాదానికి గురైంది.

Advertisement
 
Advertisement
Advertisement