రాయగడ: జిల్లాలోని రామనగుడలో జూన్ 1, 2, 3 తేదీల్లొ నిర్వహించనున్న 103 కుండీల విశ్వశాంతి మహాయజ్ఞానికి సంబంధించి శనివారం భూమి పూజ, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మూడు రోజులు జరిగే ఈ మహాత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చైతన్య రాంజీ, ఎస్‌డీసీ చైర్మన్ బిద్యాధర్ సబర్, రామనగుడ సమితి అధ్యక్షులు రవి గొమాంగో, గాయత్రీ పరివార్ ప్రచారకులు ప్రదీప్ మహారణ, బిజేపీ నాయకుడు యాళ్ల కొండ బాబు, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర శాఖ కన్వీనర్ ఛొటేలాల్ మహాంతి తదితరులు పాల్గొన్నారు. రామనగుడలోని ప్రతీ గ్రామం నుంచి పవిత్ర మైన మట్టి ఆ ప్రాంత నీటిని తీసుకువచ్చి యజ్ఞ సన్నిధిలో నిలిపి ప్రత్యేక పూజలను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను వక్తలు వ్యక్తం చేశారు.


