రాయగడ: ప్రకృతి సంపదను హరించి వేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న దమన కాండను ఆపివేయాలని, అమాయకులైన ఆదివాసీలపై పెట్టిన అబద్ధపు కేసులను ఉపసంహరించుకోవాలని.. లేదంటే తమ పార్టీ తరఫున ఆదివాసీలకు మద్దతుగా ఆందోళన చేపట్టడం ఖాయమని అటాఘడ్ ఎంఎల్‌ఏ, బీజేడీ సీనియర్ నాయకుడు రాణేంద్ర ప్రతాప్ స్వయి అన్నారు. జిల్లాలొని కాసీపూర్ లోని కంటామాల్‌లో ఇటీవల పోలీసులు, గ్రామస్తు ల మధ్య జరిగిన ఘటనకు సంబంధించి గురువా రం నాడు ఆ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీంలో పాల్గొని వివరాలు సేకరించిన అనంతరం శుక్రవారం నాడు స్థానిక హోటల్ విజేత కాంటినంటల్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాసీపూర్‌లో ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారని అన్నారు. పోలీసులు చేసిన దమనకాండ కారణంగా గ్రామంలొ ఎంతొ మంది గాయాలు పాలయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమితిలొ గల సిజిమాలి బాక్సయిట్ తవ్వకాలకొసం వేదంత కంపెనీకి అనుమతులు ఇవ్వడంతొ ఆ కంపెనీ ప్రజల గ్రామస్తులు అనుమతులు లేకుండా రహదారిని ఏర్పాటు చేయడం తొ గ్రామస్తులు అడ్డుకున్నారని అన్నారు. అయితే అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతొ పాటు అర్ధరాత్రి సమయంలొ కంటామాల్ గ్రామంలొ సృష్టించిన దమన కాండ కారణంగానే పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని వివరించారు. గ్రా మ, పల్లెసభలు లేకుండా బాక్సయిట్ నిక్షేపాలను తవ్వడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృధ్ది పేరిట వినాసం సృష్టిస్తుందనడానికి కంటమాల్‌లొ ఇటీవల చోటు చేసుకున్న పరిణామమే నిదర్శనమని అన్నారు. పోలీసులు దాడులకు అమాయక ఆదివాసీలు గాయాలు పాలవ్వడం విచారకరమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికై న నిద్ర లేచి పరిస్ధితిని సమీక్షించాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా కంటామాల్ గ్రామంలొ అమలు చేసిన బిఎన్‌ఎస్ 163 సెక్షన్ ను ఎత్తి వేయడంతొ పాటు అక్కడ శాంతియుతమైన వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జంగల్, జమీ అన్న నినాదాలతొ ఆదివాసీలు వారి హక్కుల కొసం పోరాడుతున్నారని వారి హక్కులను కాలరాయడం ప్రజా వ్యతిరేకతకు దారి తీస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చోరవ తీసుకుని ఖనిజ నిక్షేపాలు గల ప్రాంతాల్లొ ఉన్న ప్రజలతొ సమావేశాలను నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాకే తవ్వకాల కొసం ఏ కంపెనీకి అను మతులు ఇచ్చినా అభ్యంతరాలు ఎదురవ్వవని అ న్నారు. ఈ సమావేశంలొ బిజేడి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాధ సరక, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు అనసూయా మాఝిలు పాల్గొన్నారు.


