కొరాపుట్: కొరాపుట్ జిల్లాలలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. శనివారం రాత్రి 11 గంటల 31 నిమిషాలకు భూమి ప్రకంపనలు వచ్చాయి. దాంతో ప్రజలు తీవ్ర ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొరాపుట్, సిమిలిగుడ, నందపూర్, పొట్టంగి తదితర సమితుల్లో ప్రజలు స్వయంగా ప్రకంపన అనుభూతిని పొందారు. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలలో భూకంప ప్రకంపం వల్ల ఇళ్లు కదలడం రికార్డు అయింది. హఠాత్తుగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయపడ్డారు. పలువురు గిరిజనులు ఇళ్ల బయట జాగారం చేశారు. ఈ ప్రకంపనలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేల్ మీద 4.4 మాగ్నిట్యుడ్ గా నమోదైంది.


