భారీగా గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి స్వాధీనం

Mar 29 2026 6:51 AM | Updated on Mar 29 2026 6:51 AM

భారీగా గంజాయి స్వాధీనం

నరసన్నపేట: ఒడిశా నుంచి తమిళనాడులోని తిరువూర్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అజిత్‌కుమార్‌, గోకుల్‌ శక్తివేల్‌లను నరసన్నపేట పోలీసు లు శనివారం అరెస్టు చేశారు. మడపాం టోల్‌గేట్‌ వ ద్ద నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వాహనంలో వెళ్తున్న అజిత్‌కుమార్‌ పట్టుబడినట్లు సీఐ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఈయన వద్ద 12.550 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా సత్యమంగళంకు చెందిన అజిత్‌కుమార్‌ ఒక ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తుండగా అదే కంపెనీలో పనిచేసే పద్మచరణ్‌ దిగల్‌ బత్తుతో పరిచయం ఏర్పడింది. ఈయన సహకారంతో అజిత్‌కుమార్‌ భువనేశ్వర్‌లో తక్కువ ధరకు గంజాయి కొని తమిళనాడులోని తిరువూర్‌ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయాలు చేయడం ప్రారంభించాడు. మంచి ఆదాయం వస్తుండటంతో ఈ నెల 21న తిరువూర్‌ నుంచి బయల్దేరి పద్మచరణ్‌ సూచించిన వ్యక్తి వద్దకు వెళ్లి తన స్నేహితుడు గోకుల్‌ శక్తివేల్‌తో కలసి గంజాయి కొనుగోలు చేసి తిరిగి తిరువూర్‌ వెళ్తుండగా మడపాం వద్ద శనివా రం పట్టుపడినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

3 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్‌

ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి తమిళనాడుకు 3.060 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ మీసాల చిన్నం నాయుడు తెలిపారు. పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో శనివారం సీఐ విలేకరులతో మాట్లాడారు. స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడులోని కాంచీపురం జిల్లా వలజబాద్‌కి చెందిన నాగరాజుమురుగన్‌, రాజీలు గంజాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయి, ఒక సెల్‌ ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు.వీరిని విచారించగా ఒడిశా సమంతపూర్‌ చంచలకులో గ్రామానికి చెంది న బరుజోదోళాయి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకి తీసుకెళ్తుండగా పోలీసుల కు పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు. పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, క్రైమ్‌ సిబ్బంది ఉన్నారు.

రెండు కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు

ఆమదాలవలస: బీఆర్‌ నగర్‌ సమీపంలో రెండు కేజీల గంజాయితో పట్టుబడిన ఆమదాలవలస పట్టణానికి చెందిన సయ్యద్‌ తాహిర్‌, మన్యాల నరేష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. గంజాయి సేవిస్తున్న అందిన పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. వీరి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement