సృజన్ ఉత్సవాలు ప్రారంభం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వ విద్యాలయంలో సృజన్ 4.0 పేరిట వార్షిక సాంస్కృతిక ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూఢిల్లి ఏఐసీటీఈ అసిస్టెంట్ డైరెక్టర్ (భారత ప్రభుత్వం) డాక్టర్ దీపన్ కుమార్ సాహు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయంలోని మెగా ఆడిటోరియం ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిశోధన, ఆధునిక ఆలోచనలతో ఏదైనా ముందుకు సాగుతుందని, అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. విద్యార్థులు ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌కు చెందిన ఐడాస్ టెక్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరక్టర్ కొలూరి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు ఎల్లవేళలా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపాధ్యక్షుడు చంద్రధ్వజ్ పండ, డైరక్టర్ జగదీష్ పండ, రిజిస్ట్రార్ ఏవీఎన్ రావు తదితరులు పాల్గొన్నారు.
సృజన్ ఉత్సవాలు ప్రారంభం


