ఎయిర్‌పోర్టుని విస్తరిస్తాం
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాలోని జయపూర్‌లో ఉన్న ఎయిర్‌పోర్టుని విస్తరిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి ప్రకటించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని పరబ్ మైదానంలో జరుగుతున్న జాతీయ స్థాయి కొరాపుట్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం పరబ్–2025లో శనివారం ప్రసంగించారు. జయపూర్ ఎయిర్‌పోర్టు విస్తరణ చేస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాగా వరుసగా రెండు రోజులుగా పరబ్ కవరేజీ చేస్తున్న మీడియాను పోలీసులు నియంత్రిస్తుండడంతో పాత్రికేయులు ఆందోళనకి దిగారు. దీంతో వారికి అధికారులు సర్ది చెప్పారు. మరోవైపు పాత్రికేయులు సౌమ్య రంజన్, సీహెచ్ భగవతి ఆచారీలు పెన్సిల్ ద్వారా మంత్రి సురేష్ పూజారి చిత్రం గీసి బహుకరించారు. గిరిజనుల సమస్యలపై బీజేడీకి చెందిన కొరాపుట్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సస్మితా మెలక మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రఘురాం మచ్చో, రూపుధర్ బోత్ర, కలెక్టర్ సత్యవాన్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్టుని విస్తరిస్తాం


