సగం కాలిన మృతదేహం స్వాధీనం
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబోదల పోలీస్‌స్టేషన్ పరిధి కుముడాబలి గ్రామంలో సగం కాలిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు చందనతుల డొంగారి (68)గా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా చందనతుల ఒక్కడే తన ఇంట్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుడి వద్దనున్న బంగారం, నగదును దుండగులు తీసుకున్న అనంతరం, అతనిని కాల్చి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కలహండి జిల్లా ఎస్పీ దేవరకొండ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. రాయగడ జిల్లా ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ సెలవులపై ఉండడంతో ఇన్‌చార్జి ఎస్పీగా నాగరాజు వ్యవహరిస్తున్నారు.
సగం కాలిన మృతదేహం స్వాధీనం
సగం కాలిన మృతదేహం స్వాధీనం
సగం కాలిన మృతదేహం స్వాధీనం


