జిరంగో వద్ద ఫైవ్‌స్టార్ హొటల్
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ జిరంగో వద్ద టిబెటియన్ల బౌద్ధ మందిరం సమీపంలో టూరిస్టుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించడానికి ఇండోనేషియా నుంచి ఎండీ ప్రత్యకాష్ ఆర్కిటెక్ట్, ఎస్టేట్స్ సోమవారం పర్యటించారు. ఇక్కడకు వచ్చే టూరిస్టుల కోసం కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఐదు నక్షత్రాల హోటళ్లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి తెలియజేశారు. ఎండీ ప్రత్యకాష్ సబ్ కలెక్టర్ అనుప్ పండా, మోహన తహసీల్దార్‌తో టిబెటియన్ శరణార్థుల గెస్టు హౌస్‌లో బసచేసి అధికారులతో మాట్లాడారు. చంద్రగిరి సమీపంలో ఉన్న జిరంగోలో ఐదు నక్షత్రాల హోటళ్లు నిర్మిస్తే ఈ ప్రాంతం పర్యాటక రంగంలో కొత్త రూపం దాల్చడమే కాకుండా పలువురికి ఉపాధి కలుగుతుందని ప్రత్యకాష్ తెలిపారు.
జిరంగో వద్ద ఫైవ్‌స్టార్ హొటల్


