ట్రాక్టర్ ఢీకొని 9 జీవాలు మృతి
పర్లాకిమిడి: రాణిపేట రోడ్డులో పవర్ స్టేషన్ వద్ద ఒక ట్రాక్టర్ సోమవారం వేకువ జామున 4.30 గంటలకు విపరీత మంచు కారణంగా రోడ్డుపై మేతకు వెళ్తున్న మేకలపై ఎక్కించడంతో 9 జీవాలు మృతి చెందాయి. పాతపట్నం మండలం గంగువాడ పంచాయతీ గోపాలపురం గ్రామానికి చెందిన కిర్రాయి ఆనంద్, చిన్ని సోమేష్‌లు తమ యాదవ కుల సంఘానికి ఈ విషయం తెలియజేయడంతో క్రిష్ణ గొల్ల సంఘం అధ్యక్షుడు ఎ.కులవర్ధన రావు సంఘటనా స్థలంకు విచ్చేసి ట్రాక్టరు యజమాని నుంచి రూ. 50వేలు వసూలు చేసి కిర్రాయి ఆనంద్, సోమేష్‌లకు నష్టపరిహారం కింద అందజేశారు. ఈ ట్రాక్టరు దుర్ఘటనలో రెండు మేకలు, 7 గొర్రెలు మృతి చెందాయి.


