కళాకారులను ప్రోత్సహించాలి
● బిసంకటక్
ఎమ్మెల్యే నీలమాధవ హికక
చొయితీ వేదికపై ముఖ్య అతిథితో నిర్వాహకులు
రాయగడ: ప్రతిభ ఉన్న కాళాకారులు ఎంతో మంది ఉన్నప్పటికీ వారికి సరైన ప్రోత్సాహం లభించకపోవడంతో వారు ఉన్నత స్థాయికి చేరుకోలేకపొతున్నారని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. జిల్లాలోని మునిగుడలో శనివారం సాయంత్రం జరిగిన చొయితీ సమితి స్థాయి ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళలకు పుట్టినిళ్లుగా గుర్తింపు పొందిన మన రాష్ట్రంలో కళాకారులకు ప్రోత్సాహం అంతంతమాత్రంగానే ఉందన్నారు. కళాకారులను ప్రోత్సాహించేందుకు చొయితీ వంటి ఉత్సవాలు నిర్వహిస్తుండటం కళాకారులకు కొంత ఊరట కలుగుతుందన్నారు. ఇటువంటి తరహా కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం విరివిగా నిర్వహించి, వారిని ప్రోత్సాహిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుని వారి ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుందన్నారు. అంతకు ముందు బీడీఒ కృష్ణ చంద్ర దలపతి, జితేంద్ర కుమార్ ఆధ్వర్యంలో కొనసాగిన ఉత్సవాల్లో భాగంగా ఉదయం కలశ యాత్ర, మషాల్ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం కళాకారులు నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే ఆదివాసీ నృత్యాలు, సంబల్‌పూరి వేషధారణలో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులకు ప్రోత్సాహక బహుమతులను ముఖ్యఅతిథిగా హాజరైన హికక అందించారు.
కళాకారులను ప్రోత్సహించాలి
కళాకారులను ప్రోత్సహించాలి
కళాకారులను ప్రోత్సహించాలి


