ముగిసిన పెన్‌కాక్ సిలాట్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడలతో శారీరక ఉల్లాసంతోపాటు మానసిక ఆనందం లభిస్తుందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేదికగా జిల్లాస్థాయి పెన్‌కాక్ సిలాట్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 500 మంది వరకు క్రీడాకారులు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. విజేతలకు శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులతోపాటు పెన్‌కాక్ సిలాట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రేగిడి దయామయ, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్‌నాయుడు, ఒలింపిక్, పీఈటీ సంఘ నాయకులు పాల్గొన్నారు.


