రాయగడలో ఉప ముఖ్యమంత్రి పర్యటన నేడు
రాయగడ: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడా సొమవారం రాయగడలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 8.50 గంటలకు ఆమె భువనేశ్వర్‌లో గల బిజుపట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రమం నుంచి హెలీ కాప్టర్‌లో బయల్దేరుతారు. జిల్లాలోని చందిలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ఆమె ఉదయం 10.20 గంటలకు చేరుకుంటారు. అనంతరం 10.30 గంటలకు స్థానిక రైల్వే స్టేషన్‌లో జరగనున్న వయోవృద్ధుల తీర్థయాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.35 గంటలకు స్థానిక మజ్జిగౌరి మందిరానికి హాజరై అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు జిల్లాలొ కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మిషన్ శక్తి, పర్యాటక రంగానికి సంబంధించి అధికారులతో సమావేశమై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి హెలీకాప్టర్‌లో భువనేశ్వర్ వెళ్తారు.


