పరబ్–2025లో పర్వతారోహణ పోటీలు
కొరాపుట్: కొరాపుట్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం పరబ్–2025 నేపథ్యంలో పర్వతారోహణ పోటీలు జరిగాయి. కొరాపుట్ జిల్లా నారాయణ పట్న సమితి బిజా ఘాటీ గ్రామ పంచాయతీ కలియా మాలి పర్వతంపై కలెక్టర్ సత్యావాన్ మహాజన్ జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. సుమారు 5 కిలోమీటర్ల దూరం ఔత్సాహికులు కొండ పైకి ఎక్కారు. వారితో పాటు కలెక్టర్ కూడా పర్వతారోహణ చేయడం గమనార్హం. ఇంత వరకు దేవమాలిపై పర్వతారోహణ జరిగేది. కానీ కలియామాలిని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి కలెక్టర్ తొలిసారిగా ఇక్కడ పర్వతారోహణ పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం శశ్యా రెడ్డి, సిఆర్‌పిఎఫ్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. విజేతలకు కొండ మీద బహుమతి ప్రధానం జరిగింది.
పరబ్–2025లో పర్వతారోహణ పోటీలు
పరబ్–2025లో పర్వతారోహణ పోటీలు
పరబ్–2025లో పర్వతారోహణ పోటీలు


