అక్రమ లే అవుట్లు..!
పుట్టగొడుగుల్లా..
● నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు ● చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
పలాస: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా యి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ప్లాట్లు వేస్తున్నారు. ఈ లేఅవుట్ల పక్క న ప్రభుత్వ భూములు, చెరువులు, వరద కాలువలు ఉన్నా వాటిని సైతం అందులో కలిపేస్తున్నారు. ఈవిధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. మున్సిపాలిటీలో ఇటువంటి అక్రమ లే అవుట్లు సుమారు 22 ఉన్నాయి. ఇందులో అత్యధిక శా తం టీడీపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ లో కీలక స్థానాల్లో ఉన్నవారివేనని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టించుకోని అధికారులు
పలాస పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఉదయపురం రెవెన్యూలోని సర్వే నంబరు 221/13లో ఇటీవల వేసిన సీతమ్మ గుడి వద్ద లే అవుట్ స్థానికంగా వివాదాస్పదమైనా అధికారు లు స్పందించ లేదు. వ్యక్తుల సదుపాయం కోసం కూర్చోడానికి వేసిన చిన్న చిన్న బల్లలను సైతం తొలగించడంతో ఆ బల్లలు వేసిన తాళాసు మన్మథరావు, అదే ప్రాంతానికి చెందిన నౌగాపు మల్లి, స్థానిక ప్రజలు అడ్డుకున్నప్పటికీ ఆగలేదని, అంతేకాకుండా ఆ పక్కన ఎప్పుటినుంచో ఉన్న వంశధార కాలువ గట్టును లే అవు ట్ వేసిన వ్యక్తి రోడ్డులో కలిపేశాడని స్థానికులు మండిపడుతున్నారు. అలాగే కాశీబుగ్గ సూదికొండ పక్కన ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయం పక్కన సుమారు 4 ఎకరాల వరకు కబ్జా జరిగిందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం పేదలు నిర్మించిన ఇళ్లను సైతం కూల్చేశారు. అలాగే 200 పడకల కిడ్నీ ఆస్పత్రి పక్కన సర్వే నంబరు 253లో 300 మూరల భూమిని దోపిడీ కాజేశారు. పద్మనాభపురం శనీశ్వరుడి మెట్ట ప్రాంతంలో రెండెకరాలు భూమిని టీడీపీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్ ఆక్రమించుకొని చదును చేసుకున్నాడు. ఈవిధంగా ఒకపక్క అక్రమ లేఅవుట్లు.. మరో పక్క భూకబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తు న్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా తాను కొత్తగా వచ్చానని.. మొత్తం లే అవుట్లు 22 ఉన్నమాట వాస్తవమేనన్నారు. వీటి వివరాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు.


