ఆరామ ద్రావిడ సంఘం ఆత్మీయ కలయిక
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఆరావ ద్రావిడ బ్రాహ్మణ సంఘం సభ్యులు 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా ఆఫీసు వద్ద శనివారం ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా వైదిక సాంప్రదాయాలతో, సనాతన సంస్కృతి వైభవాలతో, సమాజ హితాన్ని కాంక్షిస్తూ అందరూ మార్గదర్శకంగా ఉండాలని సమావేశానికి అధ్యక్షత వహించిన అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆరామ ద్రావిడ సంఘం కేంద్ర అధ్యక్షుడు ఇప్పిలి శంకర్ శర్మ పిలుపునిచ్చారు. చిన్నారులకు ఆటల పోటీలు, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా బంకుపల్లి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో కచేరి కార్యక్ర మం చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, సంఘం గౌరవ అధ్యక్షుడు వేమ కోటి సూర్యనారాయణ శర్మ, అంపోలు రుద్రకోటి శర్మ, వేమకోటి నరహరశాస్త్రి, అమ్ములు ఉమామహేశ్వర శర్మ, భాస్కరభట్ల శ్రీరామశర్మ, పెంటా శ్రీనివాస్ శర్మ, ధర్మపురి గౌరీశంకర్ శాస్త్రి, బంకుపల్లి సత్యనారాయణ శర్మ, రేజేటి వెంకటరమణ, సత్య ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతరం ఆరామ ద్రావిడ సంఘం నూతన కార్యవర్గాన్ని రేజేటి రామాచార్యులు, వేమకోటి నరహరి శాస్త్రి, వేమకోటి సూర్యనారాయణ శర్మల అధ్యక్షతన చేపట్టారు. దీనిలో భాగంగా కేంద్ర అధ్యక్షుడిగా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, కార్యదర్శిగా జోస్యుల శివప్రసాద్‌శర్మ, కోశాధికారిగా ధర్మపురి గౌరీశంకరశాస్త్రి, శ్రీకాకుళం అధ్యక్షుడిగా సుసరాపు గణపతి శర్మ, కార్యదర్శిగా దార్లపూడి రవి ప్రతాప్‌శర్మ, కోశాధికారిగా లక్ష్మీధనుంజయశర్మ, విజయనగరం అధ్యక్షుడిగా అంపోలు ఉమామహేశ్వరశర్మ, కార్యదర్శిగా పులఖండం కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


