ఉత్సాహంగా అథ్లెటిక్స్ పోటీలు
జయపురం : జాతీయ ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ – 2025 సందర్భంగా శనివారం జయపురం స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో అథ్లెటిక్స్ మీట్ నిర్వహించారు. కొరాపుట్ జిల్లాలో 14 సమితులు, 3 మునిసిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా(ఎన్.ఎ.సి)ల నుంచి వందలాది మంది క్రీడాకారులు హాజరయ్యారు. 100 మీటర్ల పరుగు బాలురు విభాగంలో అశోక్‌కుమార్ బెహరా(జయపురం), బాలికల విభాగంలో జానకీ చలాన్(కొరాపుట్), 200 మీటర్ల పరుగు బాలురు విభాగంలో ధనరాజ్ ముదులి(కుంద్రా), జాహన్ హరిజన్(జయపురం), బాలికల విభాగంలో రంజిత మండంగి(నారాయణపట్న) గెలుపొందారు. ఇతర విభాగాల్లోనూ క్రీడాకారులు సత్తాచాటారు. ఈ సందర్భంగా జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో మెలగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి జ్ఞానజిత్ త్రిపాఠీ, సబ్ డివిజన్ అథ్లెటిక్ అసియేషన్ కార్యదర్శి రబి నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా అథ్లెటిక్స్ పోటీలు


