ఉత్సాహంగా అంతర్ కళాశాలల పోటీలు
ఎచ్చెర్ల : ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎచ్చెర్లలోని కింజరాపు ఎర్రంనాయుడు వ్యవసాయ కళాశాలలో శుక్రవారం అంతర్ కళాశాలల క్రీడా పోటీలు, సాంసృతిక, సాహిత్య సమావేశాలను శుక్రవారం ప్రారంభించారు. స్థానిక కళాశాలతో పాటు 18 వ్యవసాయ కాలేజీలకు చెందిన 486 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డాక్టర్ ఎల్.నారంనాయుడు మాట్లాడుతూ క్రీడా పోటీల నిర్వహణకు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నైరా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి.జోగినాయుడు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ బుడుమూరు శ్రీరామ్మూర్తి, వి.వి.ఎస్.ఎన్.మూర్తి, దుర్గాశ్రీనివాస్, ఐ.కిషోర్, డాక్టర్ ఆర్.రవికాంత్‌రెడ్డి, జి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా అంతర్ కళాశాలల పోటీలు


