పేదలకు నిత్యావసరాల పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు శుక్రవారం నాడు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రతీ నెల ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలిపారు. బియ్యం, కందిపప్పు, నూనె, బంగాళదుంపలు వంటి నిత్యావసర వస్తువులతోపాటు రగ్గులను పంపిణీ చేశామన్నారు.
విష ప్రయోగంతో చిరుత మృతి..?
భువనేశ్వర్: సుందర్‌గఢ్ జిల్లా బొణై తమొడా రేంజ్‌లో చిరుత పులి మృతి చెందినట్లు గుర్తించారు. విషం పెట్టిన మృత ఎద్దుని పులి తినడంతో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఖేసర అటవీ ప్రాంతంలో జరిగిన ఈ విషాద సంఘటనపై బొణై డీఎఫ్‌వో దర్యాప్తు చేపట్టారు.
బార్‌లో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: స్థానిక సత్యవిహార్ ప్రాంతంలోని ఒక బార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆస్తి నష్టం మినహా ప్రాణహాని వంటి విషాద ఘటనలు చోటు చేసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. దాదాపు ఒక గంట సేపు నిర్విరామంగా శ్రమించి మంటలు అదుపు చేసినట్లు చీఫ్ పైర్ ఆఫీసర్ రమేష్ మాఝి తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
భువనేశ్వర్: స్థానిక సాహిద్ నగర్ పోలీస్ ఠాణా పరిధిలోని ఆనంద్ బజార్ సమీపంలో చెట్టు కొమ్మకు వేలాడుతున్న యువకుడి మృతదేహం లభ్యమైంది. యువకుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. సాహిద్ నగర్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ట్రక్కు ఢీకొని హెల్పర్ మృతి
భువనేశ్వర్: పూరీ బట్టొగాంవ్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుకతో నిండిన హైవా అదుపు తప్పి సిమెంట్ ఇటుకలు రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో సహాయకుడు మరణించాడు. మృతుడు భాస్కర్ జెనా (40)గా గుర్తించారు. సదర్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం చేరి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పేదలకు నిత్యావసరాల పంపిణీ
పేదలకు నిత్యావసరాల పంపిణీ
పేదలకు నిత్యావసరాల పంపిణీ
పేదలకు నిత్యావసరాల పంపిణీ


