గజపతి క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం
పర్లాకిమిడి: రాష్ట్రస్థాయి 69వ క్రికెట్ చాంపియన్ షిప్ పోటీలలో విజేతగా నిలిచి కప్పుతో తిరిగొచ్చిన పర్లాకిమిడి క్రికెట్ జట్టుకు స్థానిక రైల్వేస్టేషన్‌లో శుక్రవారం స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఈ విజయం సమగ్ర గజపతి జిల్లాలో ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు నబకిశోర్ శోబోరో కితాబునిచ్చారు. జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా శిక్షవిభాగం పాఠశాల పీఈటీ సురేంద్ర పాత్రో, తదితరులు రైల్వేస్టేషన్‌కు విచ్చేసి ట్రోఫీతో వచ్చిన క్రికెట్ ఆటగాళ్లను అభినందించారు.


