● హిమాలయాలను ఎక్కేసింది..
● జయపురం విద్యార్థిని ఘనత
జయపురం: జయపురంలోని విక్రమదేవ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని హీరాశీశ హిమాలయాల్లోని గోరిచిన్ శిఖరాన్ని అవరోహించి రికార్డు సృష్టించి కొరాపుట్ జిల్లాకు పేరు తెచ్చింది. ఆమె విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్‌లో +3లో రెండో సంవత్సరం చదువుతోంది. ఎన్‌సీసీ కేడెట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. సముద్ర మట్టానికి 21 వేల అడుగుల (7 వేల మీటరు) ఎత్తుకు చేరి రికార్డు సృష్టించింది. హీరాశీశది కొరాపుట్ జిల్ల లక్ష్మీపూర్ సమితి గున్నయపడ గ్రామం. తల్లిదండ్రులు సమర శీశ, ఉల్లాష శీశ వ్యవసాయ కార్మికులు. హిమాలయ పర్వత్వాన్ని సునాయాశంగా ఎక్కేసి విక్రమదేవ్ విశ్వవిద్యాలయానికిపేరు తెచ్చిన హీరా శీశను రిజిస్టార్ మహేశ్వరకుమార్ నాయిక్ తదితరులు శుక్రవారం సత్కరించి అభినందించారు.
● హిమాలయాలను ఎక్కేసింది..
● హిమాలయాలను ఎక్కేసింది..


