నగదు విత్ డ్రా చేసుకోవచ్చు
పర్లాకిమిడి: బ్యాంకు డిపాజిటర్లు, బ్యాంకు మ్యూచువల్ ఫండ్లు, జీవిత బీమా సంస్థల్లో పెట్టుబడులు పెట్టి కొన్నేళ్లుగా ఫ్రీజ్ అయిన సొమ్ములు ప్రస్తుతం ఆర్‌బీఐ సరళీకృత విధానంతో తిరిగి విత్ డ్రా చేసుకోవచ్చని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారి రితేష్ కుమార్ పాత్రో తెలిపారు. స్థానిక టౌను హాలులో బ్యాంకర్స్, బీమా సంస్థలు, సెబీ ఆధ్వర్యంలో ‘మీ సోమ్ము.. మీ అధికారం’ అభియాన్‌ను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్, ఏడీఎం మునీంద్ర హానగ, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి తదితరులు పాల్గొనగా, గజపతి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ మహేశ్వర్ మండల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధికి చెక్కులు పంపిణీ చేశారు.


