● పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● రాష్ట్రంలో 16 చోట్ల 10 డిగ్రీల
కంటే తక్కువ ఉష్ణోగ్రత
భువనేశ్వర్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతూ.. చలిగాలులు బలంగా వీస్తున్నాయి. దాదాపు 16 నగరాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైందని ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల 2 వారాల పాటు తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగుతాయని ముందస్తు సమాచారం జారీ చేశారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం చాలా చోట్ల ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదైంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు దిగజారింది. ఈ నెల 18 వరకు రాష్ట్రంలో చలి గజగజలాడిస్తుంది. డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 25 వరకు రాత్రి పూట ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా. సెమిలిగుడలో కనిష్ట ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్‌గా, జి.ఉదయగిరిలో కనిష్ట రాత్రిపూట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జంట నగరాలు భువనేశ్వర్ మరియు కటక్‌లలో 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం సమాచారం.


