మాస్టర్స్ పోటీల్లో సత్తాచాటాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్రపోటీల్లో పతకాల పంట పండించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా మా మాస్టర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేష న్ హైస్కూల్ వేదికగా మా అథ్లెటిక్స్ అధ్యక్షుడు ఎండీ కాసింఖాన్ కళావతి ఆధ్వర్యంలో ఎంపికై న అథ్లెట్లకు క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాపట్లలో ఈ నెల 12 నుంచి జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న మాస్టర్స్ అథ్లెట్స్ తుది జాబితాను ప్రకటించారు. వివిధ విభాగాల్లో పురుషులు, మహిళలు కలిపి 21 మందిని ఎంపిక చేశారు. అనంతరం ఎమ్మెస్సార్ మాట్లాడుతూ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్రపోటీల్లో పతకా ల మోద మోగించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులందరికి కాసీంఖాన్ దంపతుల మనమరాలు సఫి యా కమల్ పేరున క్రీడా దుస్తులు, ట్రాక్ షూట్, టీ షర్ట్‌లు అందజేసినట్లు తెలిపారు. డీఎస్‌ఏ కోచ్ అర్జున్‌రావు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపోటీల్లో మొద టి రెండుస్థానాల్లో నిలిచినవారు జాతీయ పోటీలకు ఎంపికవుతారని చెప్పారు. కార్యక్రమంలో పలువు రు మాస్టర్ అథ్లెట్లు, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.


